Telangana Revenue రాష్ట్ర రిజిస్ట్రేషన్ల రాబడి గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిసెంబరు వరకు వ్యవసాయ, వ్యవసా యేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9,531 కోట్ల ఆదాయం సమకూరింది.
డిసెంబరులో రూ.1,100 కోట్లకు పైగా రాబడి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15,600 కోట్ల ఆదాయం
సమకూరే అవకాశం ఉన్నట్లు అంచనా. గత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.10,997 కోట్ల రాబడి రాగా
ఈ ఏడాది ఇప్పటికే రూ.9,500 కోట్లు దాటింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (తొలి 9 నెలల్లో) రాష్ట్రవ్యాప్తంగా 14.54 లక్షల ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఇందులో 5.63 లక్షల (39%) మేర వ్యవసాయ ఆస్తులు కాగా.. 8.91 లక్షలు (61%) వ్యవసాయేతర ఆస్తులున్నాయి.
డిసెంబరులో రికార్డుస్థాయిలో ఈ ఏడాలోనే అత్యధికంగా 1.09 లక్షల వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Telangana Revenue ఇంతవరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషనల్ల ద్వారా రూ.7,944 కోట్లు సమకూరగా.. వ్యవసాయ
భూముల ద్వారా రూ.1,587 కోట్ల ఆదాయం వచ్చింది. రానున్న మూడు నెలల్లో అంచనాల మేరకు రాబడి
సమకూరే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల
‘రియల్ ఎస్టేట్’కు పెరుగుతున్న డిమాండ్, నలువైపులా క్రయ విక్రయాలు పెరుగుతుండటం వంటి పరిణామాలు
రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రాబడిని పెంచుతున్నాయి.
Telangana Revenue నెలల వారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం (రూ. కోట్లలో)
నెల | వ్యవసాయ ఆస్తులు | వ్యవసాయేతర |
ఏప్రిల్ | 196 | 1003 |
మే | 208 | 921 |
జూన్ | 219 | 893 |
జులై | 198 | 779 |
ఆగస్టు | 147 | 877 |
సెప్టెంబరు | 168 | 865 |
అక్టోబరు | 128 | 779 |
నవంబరు | 149 | 859 |
డిసెంబరు | 174 | 968 |
Good information