• స్థిరాస్తి వ్యాపారంలో అక్రమాలకు కళ్లెం పడనుంది వాణిజ్య స్వంత ఇంటి స్థలాల క్రయోవిక్రియలకు చట్ట భద్రత లభించనుంది …
• తెలంగాణ పురపాలక శాఖ స్థిరాస్తి అభివృద్ధి చట్టం నిబంధనలు జారీ చేసింది … జులై 31న జారీ చేసిన జీవో 202 లో తెలంగాణ స్థిరాస్తి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు పేర్కొంది …
• నేటి నుంచి అమలు లోకి రానున్న నిబంధనలు 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొందిన అన్ని ప్రాజెక్ట్ లకు వర్తించనున్నాయి….
• జనవరి 1కి ముందు ప్రాజెక్ట్ లకు చట్టం నుంచి మినహాయించారు…
• పట్టణ అభివృద్ధి సంస్థలు Dtcp, నగరపాలికలు పురానగరపాలిక పంచాయతీలు , TS ఐఐసి సంస్థలకు నిబంధనలు వర్తిస్తాయి …
• కొత్త చట్టం ప్రకారం స్థిరాస్తి ప్రాజెక్టు చేపట్టాలి అంటే స్థిరాస్తి నియంత్రణ సంస్థ వద్ద నమోదు చేయించాలి…
ఆన్లైన్ సేవలు వచ్చే వరకు ఫారం -ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి…
• వెంచర్ అభివృధి దారుడి ఫోటో, చిరునామా , ఫోన్ నెంబర్, పాన్ కార్డు కాపీ ని సమర్పించలి…
• స్థిరాస్తి ప్రాజెక్ట్ కి సంబంధించిన హక్కులు యాజమాన్య హోదా సహా ఎలాంటి వివాదాలు లేవు అని 10 ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్న న్యాయవాది లేదా తహసీల్దారుతో ద్రువీకరించాలి ….
వెంచర్ చైర్మన్ , డైరెక్టర్ల వివరాల నమోదు తప్పని సరి….
• స్థిరాస్తి వ్యాపారం నిర్వయించే ఏజెంట్ లకు కూడా కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి … వ్యాపారం నిర్వయిస్తున్న ప్రాంతం చిరునామా తెలియజేస్తూ , పాన్ కార్డు ఫోటో తదితర వివరాలతో దరఖాస్తు చేయాలి ..
• ఏజెంట్ లు తాము ఒకరే వ్యాపారం నిర్వహిస్తే రూ. 10 వేలు ఫీజు , సంస్థగా నిర్వహిస్తే రూ. 50వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫిజు చెల్లించాలి…
సమర్పించిన విషయాలతో నియంత్రణ సంస్థ సంతృప్తి చెందుతే 5 ఏళ్లకు రిజిస్ట్రేషన్ మంజూరుచేస్తుంది … కల పరిమితి ముగిసిన తర్వాత
మల్లి ఫీజ్ గా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ….
•కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ వెబ్ సైట్లో అభివృద్ధి దారులు, ఏజెంట్, వెంచర్ పురపారాలు లభిస్తాయి…
స్థలం ప్లాట్ కొనుగోలు చేయాలి అనుకునే వారికీ ఆయా వివరాలు ఎంతో ఉపయోగ పడనున్నాయి …
• వెంచర్ అబివృది దారులు నిర్ణిత గడువులోగ ప్రాజెక్ట్ పూర్తి చేయకున్నా, నివాసాన్ని అప్పగించకున్న అప్పటి బ్యాంకు రేట్ అదనంగా 2% కొనుగోలు దారుడికి చెల్లించాలి….
• అదే కొనుగోలు దారులు సకలం లో చెల్లించక పోతే ఇవే నిబంధన వర్తిస్తుంది …
• చట్టం ప్రకారం 90 రోజుల్లో జరిమానా కట్టాలి … స్థిరాస్తి చట్టం అమలు లోకి వచ్చిన వేళా అథారిటీ ని ఏర్పాటుచేసి … చైర్మన్ సభ్యులను నిర్ణిత కాలానికి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది …..
• ప్రతి ఏడాది ఇచ్చిన అనుమతులు ప్రస్తుతం వాటి స్థితి సంబంధిత విషయాల పై ప్రభుత్వానికి అథారిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ….