Telangana Govt New Realestate Policy : సామాన్యుల సొంతింటి కల నెరవేరినట్టే ఇకపై 60 గజల ప్లాట్లుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

0
249
Telangana Govt New Realestate Policy
hyderabad reality telanagana realestate news hyderabad realestate news

Telangana Govt New Realestate Policy :

అరవై గజాల ప్లాట్ల పై ప్రబుత్వం కొత్త నిబంధనలు

తెలంగాణ రాష్ట్రంలో ఇకపై అరవై గజాల ప్లాట్ల పై ప్రబుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
ఇకనుంచి పట్టణాలు, నగరలలోని లేఔట్ లు కొత్త రూపుని సంతరించుకొనున్నాయి. అరవై గజలలో
చిన్న సైజ్ ప్లాట్ లు డిజైన్ చేసుకునేంధుకు డెవెలపర్ల కు తెలంగాణ సర్కార్ అనుమతించిoది . గతం లో
ఈ సైజ్ 143 గజాల గా ఉండేది, ఇది ఒక రకంగా చెప్పాలంటే డెవెలపర్లకు, ప్రజలకు ఊరట ఇచ్చే అంశంగా
చెప్పవచ్చు. ఇకపై పేద ప్రజలు కూడా అప్రోడ్ వెంచర్ లో ప్లాట్ లు కొనుగోలు చేసేందుకు సర్కార్ వేసులుబాటు
కలిపించినట్టు చెపుతున్నారు .

తెలంగాణ ప్రబుత్వం కొత్త లేఔట్ నిబంధనలు రూపొందించి ఆచరణలోకి తీసుకువచ్చింది. జులై ఐదవ తేదీ నుంచి ఈ నిబంధనలు మనుగడలోకి వస్తాయి అని తెలిపింది. ఈ నిబందనల ప్రకారం
Ghmc ,hmda పరిది మినహా మిగిలిన తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించిన పట్టణాలు నగరాలకు వర్తిస్తాయి.

గతంలో ప్లాట్ కనీస విస్తీర్ణo 143 గజాలు ఉండేది . ఇప్పుడు దాన్ని అరవై గజలకు తగ్గించారు . ప్లాట్ కనీస
వెడల్పు 20 ఫీట్ లు ఉంటే సరిపోతుంది. జులై ఐదవ తేదీ నుంచి రాష్ట్రం లో కొత్త పురాపాలక TS బిపాస్ చట్టం
అమలులోకి వచ్చింది . పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసారు
లేఔట్ లకు ఆన్లైన్ లో స్వీయ దృవీకరన ద్వారా అప్లై చేసుకుంటే ఇకపై అనుమతులు జారీ చేస్తారు .

నిబందనలు ఉల్లంగిన్చిన వారిని బ్లాక్లిస్ట్ లో పెడుతారు . ప్రతి లేఔట్ లో సామాజిక వసతుల కల్పన కోసం కేటాయించే స్థలాన్ని మరో 2.5% కేటాయించాలి అని ప్రబుత్వం ఆదేశించింది .సదరు వెంచర్ కి అప్రోచ్ రోడ్డు ఇకపై 60 ఫీట్లు వుండాలని స్పస్టం చేసింది ప్రబుత్వం . ఇకపై 50 ఏక్టర్ లకు మించిన విస్తీర్ణoలో నెలకొల్పే ఔట్ లకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి .

15% స్థలని మార్ట్ గేజ్ చేయాలి

మొత్తం ప్లాట్ ల విస్తీర్ణం లో 15% స్థలని మార్ట్ గేజ్ చేయాలి . స్వీయ దృవీకరణ ద్వారా అప్లై చేసుకున్న ధరకాస్తులకు ఆయా జిల్లాలో జిల్లా కలెక్టర్ నేతృత్వం లోని ప్రత్యేక కమిటీ అనుమతి మంజూర్ చేస్తుంది .ఈ కమిటీ లో జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఇందులో RND,
IRRIGATION పంచాయతీ రాజ్ సుపరిన్డెంట్ ఇంజనీర్ లు డిస్ట్రిక్ట్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ తో పాటు జిల్లా కలెక్టర్ నమినెట్
చేసిన అదికారి సబ్యులుగా ఉంటారు . దరఖాస్తు ఇచ్చిన ఐదురోజుల లోగా ఈ కమిటీ పరిశీలిస్తుంది .


10 ఏకరాలలోపు విస్తీర్ణo వెంచర్ ఐతే మునిషీపాల్ టౌన్ ప్లానిoగ్ అదికారులు 10 ఏకరలు దటుతే DTCP పరిదిలో సాంకేతిక తనికీలు చేసి జిల్లా కలెక్టర్ కు ఐదు రోజులోగా నివేదిక ఇస్తారు . లేఔట్ కు TS బిపాస్ ద్వారా అప్లై చేసుకున్న 21 రోజులోగా అనుమతి వస్తుంది . దరఖాస్తూ చేసే అప్పుడు డెవెలపర్ 10000 రూపాయల ఫీజ్ నిర్దేశించిన సర్టిఫికేట్స్ సమర్పించాలి . అప్లికేషన్ పేపర్స్ ఏమైన మిస్ అవుతే 10 రోజుల లోగా డెవెలపర్ కు తెలుపుతారు . డెవెలపర్ వాటిని 7 రోజుల లోగా సమర్పించాల్సి ఉంటుంది.

అప్రోచ్ రోడ్డు 60 ఫీట్ లకు పెంచారు

అన్నీ డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంటే వెంటనే అనుమతి ఇస్తారు . తర్వాత లేఔట్ ఫీజ్ ను 30 రోజుల లోగా చెల్లించాలి .అలా చెల్లించక పోతే మరో 30 రోజులు టైమ్ ఇస్తారు అప్పుడు 10% ఇంటెరస్ట్ తో చెల్లించాలి .లేఔట్ కు మెయిన్ రోడ్డు మద్య అప్రోచ్ రోడ్డు మాత్రం గతo లో 30 ఫీట్ లు వున్న అనుమతి ఇచ్చేవారు . కానీ ఇప్పుడు దాన్ని 60 ఫీట్ లకు పెంచారు అంటే 18 మీటర్లు వుండాల్సిందే ఒక వేల ఇప్పుడు 30 ఫీట్ ల అప్రోచ్ రోడ్డు ఉనట్టు ఉంటే ధాన్ని వెడల్పు చేసే అంతా భూమిని వధిలిపెట్టాలి. ఒక వేల భూమిని వధిలిపెట్టే అంతా వేసులు బాటు లేకపోతే 30 అడుగులే రోడ్డు వుంటే ఆ రోడ్డు అభివృది కోసం 100 % అభివృది చార్జిలను ఇంపాక్ట్ ఫీజ్ గా చెలయించాలి . అలా కాకుండా ఒకవేల సధరు వెంచర్ కు అప్రూవ్ డ్ మాస్టర్ ప్లాన్ రోడ్డు 60 ఫీట్ లు ఉండి ఫీల్డ్ లో వాస్తవంగా అంతకన్నా తక్కువ వుంటే మాత్రం రోడ్డు ఇంపాక్ట్ ఫీజ్ 50% చెల్లించాలి .

ప్రతి లేఔట్ లో 10% తక్కువ కాకుండా స్థలంని ఓపెన్ ప్లేస్ ని ముందుగానే ప్రజాఅవసరాల కోసం
మునిషిపాల్ శాఖకు అప్పగించాలి . ఇందులో 9% గ్రీనరీ కొసo కేటాయిస్తారు . మిగిలిన ఒక శాతo స్తలం లో వాటర్ టాంక్ ,సెప్టిక్ టాంక్ ట్రాన్స్ఫర్మర్ కామన్ పార్కింగ్ వంటి వాటికి కేటాయిస్తారు . సామాజిక వసతుల కొసo మరో 2.5%
ప్లేస్ ని కేటాయించాలి దీనిలో ఫార్మసీ ,స్కూల్ ,ప్లే స్కూల్ ,క్లినిక్ ,క్రాష్ ,డిస్పెంసర్ వంటి వాటికి వినియోగించాలి
సంబందిత 2.5% లాండ్ ని ఈ అవసరాల కు మాత్రమే వినియోగించేలా లేఔట్ యజమాని అమ్ముకునే అవకాశం
ఉంటుంది .

50 ఏకరల కంటే ఏకువ విస్తీర్ణం లో వెంచర్ లు వేస్తే స్కూల్ హెల్త్ సెంటర్ కమర్షియల్ స్పేస్ కోసం స్థలన్నీ కేటాయించాలి . వెంచర్ కు LP వచ్చిన రెండేళ్లలోగా డెవెలపర్ అన్నీ ఆమెనిటీస్ ఏర్పటు చేయాలి . ప్రత్యేక సందర్బాలలో మరో ఏడాది వరకు మునిషిపాల్ శాఖ గడువు పెంచుతుంది. ఐతే అలాంటి సమయంలో లేఔట్
అప్రూవ్డ్ ఫీజ్ లు 20% ఆధునంగా చెల్లించాలి ,గడువు లోగా మౌలిక సదుపాయాలు కల్పించక పోతే మార్ట్ గేజ్
చేసిన 15% ప్లాట్ ల స్తలాలను విక్రయిoచి కమిషనరే ఆ వెంచర్ లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు

Telangana Govt New Realestate Policy

Flat rates in Hyderabad after Covid ? కోవిడ్ తరవాత హైదరాబాద్ లో ఫ్లాట్ల రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా ?

Low price Open plots in Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here