SBI Home Loans : గృహ రుణాల జారీ లో ఎస్ బి ఐ ఘనత

0
130
sbi home loans

గృహ రుణాల జారీ లో ఎస్ బి ఐ ఘనత,(SBI Home Loans)

6 లక్షల కోట్లకు చేరిన ఏయూఎం

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్వహణలో ఉన్న గృహరుణాల విలువ (అసెట్ అండర్ మేనేజ్మెంట్- ఏయూఎం) రూ.6 లక్షల కోట్లకు చేరింది.
గతేడాది జనవరిలో ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో పండగల వేళ రుణగ్రహీతల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రవేశ పెట్టినట్లు ఎస్బీఐ వెల్లడించింది.

(SBI Home Loans) గృహ రుణాలపై 0.25%, టాపప్ రుణాలపై 0.15%, ఆస్తి తనఖా రుణాలపై 0.30% వడ్డీ రాయితీనిఇస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా గృహ రుణం 8.40% వడ్డీకే లభించనుంది.

జనవరి 31వరకూ గృహ రుణాలపై పరిశీలన రుసుము రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రతి భారతీయుడి సొంతింటి కలను నిజం చేయడానికి ఎస్బీఐ తోడ్పాటునందిస్తోంది. దాదాపు 28 లక్షలకు పైగా కుటుంబాలు మా బ్యాంకుపై నమ్మకంతో రుణం తీసుకున్నాయి. వీరి భా గస్వామ్యంతోనే ఈ ఘనత సాధ్యం అయ్యింది. బ్యాంకు అందుబాటులోకి తీసుకొచ్చిన పలు డిజిటల్ సేవలూ రూ.
6 లక్షల మార్కును దాటడానికి కారణం అయ్యాయి.అందరికీ ఇళ్లు అనే ప్రధాని ఆకాంక్షను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామ’ని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు.

పండగల వేళ కొనుగోలుదార్లకు పలు ప్రోత్సాహకాలు అందిస్తూ వారి సొంతింటి కలను నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఎసీబీఐ ఎండీ అలోక్ కుమార్ చౌదరి అన్నారు.

ఇతర బ్యాంకుల నుంచి రుణాలనుబదిలీ చేసుకున్న వారికి 8.40%, టాపప్ రుణాలను 8.80 శాతానికి అందిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ రియాలిటీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారా అయితే ఎక్కడ క్లిక్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here