RRR New Update: భారతమాల-2లో RRR దక్షిణ భాగం

0
55

RRR New Update హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు(ORR) అవతలి నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు (RRR) దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ‘భారతమాల-2’ ప్రాజెక్టులో చేర్చింది.

ఏడాదిన్నర క్రితం నుంచి ఈ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉండగా.. ఇటీవల జరిగిన సమావేశంలో ఆమోదం లభించింది.అధికారులు కూడా తుది కసరత్తు పూర్తి చేశారు.


కేంద్రంRRR 347.80 కిలోమీటర్ల మేర ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ రెండు భాగాలను రూ.22 వేల కోట్లతో పూర్తిచేయాలని అధికారులు మొదట అంచనా వేశారు.ఇప్పటి అంచనాల ప్రకారం రెండు భాగాలకు కలిపి రూ.25 వేల కోట్ల నుంచి రూ.26 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే నిర్మాణ వ్యయం పెరగనుంది.ఇప్పటికే ఉత్తర భాగం భూ సేకరణ తుదిదశకు చేరుకుంది

చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్ నగర్, చేవెళ్ల, సంగారెడ్డి వరకు 189.20 కిలోమీటర్ల మేర దక్షిణ భాగం RRR నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. దీని నిర్మాణానికి రూ.13 వేల కోట్ల నుంచి రూ.14.5 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా.RRR New Update

ఈ మార్గంలో ప్రైవేటు భూములతోపాటు ప్రభుత్వ స్థలాలు ఉండటంతో భూసేకరణ వ్యయం కొంత తగ్గినా.. నిర్మాణ వ్యయం మాత్రం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భాగం ప్రతిపాదనలను కేంద్రం ఏడాది క్రితమే సిద్ధం చేసినా.. ఉత్తర భాగం భూ సేకరణ వ్యవహారం
కొలిక్కి వచ్చిన తరవాత దీన్ని ‘భారతమాల-2’ లో చేర్చాలని వేచి చూసింది.

ఒప్పందం ఇక లాంఛనమే

భూ సేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉంది. ఉత్తర భాగం వ్యయంలో సగం మొత్తాన్ని దశలవారీగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది..రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సుమారు రూ. 1200 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా..మొదట రూ. 100 కోట్లను విడుదల చేసింది.

తరువాత అవసరం మేరకు విడతల వారీగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల సంస్థNAI అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే ఉత్తర భాగంలో తొలి విడత నిర్మించనున్న సుమారు 60 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదనలను అధికారులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

Also, Read This Blogs:

1.హైదరాబాద్‌లో Hayathnagar తదుపరి రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్ ఎందుకు?

2.GST: 2023 – భారతదేశ ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్

3. మీరు Ghatkesar Investment పెట్టాలని అనుకుంటున్నారా? ఇది ఒకసారి చూడండి

4. ఆస్తిని కొనుగోలు చేసే ముందు తనిఖీ చేయవలసిన కొన్ని ముఖ్యమైన,చట్టపరమైన పత్రాలు మీకు తెలుసా?

5. చౌటుప్పల్: చౌటుప్పల్ గురించి క్లూప్తంగా

Questions and Answers:

Q:RRR దక్షిణ భాగం యొక్క బడ్జెట్ ఎంత?

A:RRR దక్షిణ భాగం యొక్క ఖర్చు సుమారుగా 26వేల కోట్ల

Q:RRR దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టులో చేర్చింది.

A:RRR దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ‘భారతమాల-2’ ప్రాజెక్టులో చేర్చింది.

Q:మొత్తం RRR ఎన్ని కిలోమీటర్లు

A:మొత్తం RRR 347.80 కిలోమీటర్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here