Residential Place : ఇళ్ల స్థలం కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి ?

1
87

Residential Place ఇల్లు లేదా ఇళ్లస్ధలం కొనే ముందే సదుపాయాలు ఏమి కావాలనేది ముందుగానే ఆలోచన చేయాలి, డ్రైనేజ్ సిస్టం ఉండాలి,
కరెంటు అందుబాటులో ఉండాలి, రహదారులు వెళ్ళటం రావటానికి వీలుగా ఉండాలి,
చుట్టుపక్కలే ఇల్లులు ఉండాలి అదే విధంగా దొంగలు భయం లేకుండా దగ్గర్లో మనకి రక్షణ
కల్పించే వ్యవస్థ ఉండాలి, దూర ప్రయాణం చేయడానికి అనువుగా ఉండేలా చూసుకోవాలి.

టౌన్ సెంటర్ లోనే ఒక ఇల్లు లేదా ఇళ్లస్ధలం తీసుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది కానీ, రాను రాను జనాభా విస్తరణ పెరుగుతుంది.
దూర ప్రాంతాన్నికి వెళ్లిన కూడా మనకి అన్ని సదుపాయాలు వెంటనే రాకపోయినా రాబోయే రోజుల్లో
వస్తాయన్న నమ్మకం అవకాశం ఉన్న చోటే ఇల్లు తీసుకోవాలి.

అటువంటి స్థలాన్ని తీసుకొని కొద్దికాలం వెయిట్
చేసిన తర్వాత దాన్ని కట్టుకోవడానికి అన్ని అందుబాటులో ఉంటాయి నీటి సదుపాయం
కావాలి నీటి సదుపాయం అంటే భూమి నుంచే కాకుండా చుట్టూరుదగ్గరలో నదులు గాని
సరసలు గాని అటువంటి సదుపాయాలు మనకు ఉన్నట్లయితే నీటి సదుపాయాలకు ఇబ్బంది
ఉండదు, రాబోయే రోజుల్లో గాలి నీరు వెల్తుర్ని మనకి లోటు లేకుండ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి.

దీంతోపాటు న్యాయ పరమైన అంశాలలో కూడా మనం జాగ్రత్తగ పడాలి లేనిపక్షంలో ఎంత డబ్బు
పెట్టిన వృధా అయిపోతుంది. అన్ని అయిన తర్వాత ఇంజనీరింగ్ మరియు వాస్తు అనే వాటికీ ప్రాధాన్యత
ఇవ్వాలి,
ఇండిపెండెంట్ హౌస్ అనుకూలంగా ఉంటుందా లేదా అపార్ట్మెంట్
అనుకూలంగా ఉంటుందా అంటే దేనికుండే ప్రాధాన్యత దానికి ఉంటుంది, సిటీ మధ్యలో ఉండాలంటే
అపార్ట్మెంట్స్ అదే దూరంగా ఉంటే ఇండిపెండెంట్ హౌస్కు ఆకాశం ఉండుంది.

ఆ ఇండిపెండెంట్ హౌస్, ప్రస్తుతం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఒక గ్రామం
అనేది పట్నంగా , పట్నం అనేది నగరంగా, నగరం అనేది మహానరం గాను మారడానికి అవకాశం ఉంటది కొద్దికాలంలో
జనాభా పెరుగుదల వల్ల దూరంగా ఉన్న ఇల్లు కూడా దగ్గరవుతాయి చుట్టుపక్కల ప్రాంతాలు
వ్యాపారం పరంగా గాని ఇతర సదుపాయాలు గాని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అందుకని జనాభా పెరుగుతుంది కాబట్టి దానికి అనుకూలంగా
కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దూరంగా వెళ్లి కూడా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే చాల ఉత్తమం.
ఇండిపెండెన్స్ హౌస్ తీసుకోవడం సాధ్యపడదు కాబట్టి స్థలాలు ఎంచుకోవాలి. స్థలాలు ఎంచుకున్న
తర్వాత కొద్దికాలం వెయిట్ చేస్తే దానికి డెవలప్మెంట్ చందడానికి అవకాశం ఉంటుంది.
ఆ టైంలో మనం ఉన్న సేవింగ్స్ గాని ప్రభుత్వం ఇచ్చే లోన్స్ వల్ల గాని ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండడానికి
అవకాశం ఉంటుంది, ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత అంశంలో
అనుభవం ఉన్న వారిని గాని ఇంజనీరింగ్ ల సలహా తీసుకొని ముందుకెళ్ళినట్లయితే మంచి
ఫలితం మనం పొందడానికి అవకాశం ఉంటుంది, ఇంటికి ప్రధానమైంది స్థలం ఆ స్థలం ఎలా ఉండాలి
దిక్కులకు
అనుకూలంగా ఉండాలి ఏ దిక్కు పెరిగిన కొన్ని విధాలు లాభం మరి కొన్నివిధాలా నష్టం ఉంటుంది.

vastu

స్థలం ఎటు దిక్కు పెరగకుండా చతురస్రం గానీ దీర్ఘ చతురస్రం గాని ఉంటే
అనుకూలంగా ఉంటాయి మన గృహానికి ఈ రెండే ఎక్కువ అనుకూలమైన స్థలాలు ఇక గెస్ట్ హౌస్ లో
వాటికి కూడా రౌండ్ గా ఉండడం గాని వేరే ఇతర ఆకాశం ఉంటుంది మనం ఇంటికి సంబంధించిన విషయం
చెబుతున్నాను కాబట్టి స్థలం ఏవిధంగా ఉండాలంటే ఒకవేళ కొన్ని సందర్భాలలో కొన్ని మూలలు పెరిగి
ఉంటాయి ఆ పెరిగి ఉన్న స్థలాన్ని మనం సరిచేసుకొని ఉన్న స్థలాన్ని మనం ఇల్లు కట్టుకోవడానికి
ప్రాధాన్యత ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Residential Place అయితే ప్రతిదీ కూడా మనకి 100% అనుకూలంగా ఉండవు అనుకూలంగా చేసుకోవడమే మన
ఇంజనీరింగ్ వాస్తు నిపుణుల మేథా సంపద మీద అదర పాడి ఉంటుంది. అయితే ప్రతిది ఇల్లు, స్థలం కొన్నాం
కదా అనుకోనేదు లేదు స్థలం కొనే ముందు నుంచి ఈ ప్రణాళిక వేసుకోవాలి భవిష్యత్తులో ఈ స్థలం వల్ల ఏ విధంగా
ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి. చుట్టుపక్కల ఏ ప్రాంతాలు ఏ విధంగా డెవలప్ అవుతాయి
అన్న ఆలోచన తోటి ముందుకు వెళ్తూ ఆ నిపుణులు గాని వాస్తు నిపుణుల గాని ఇంజనీరింగ్ వాళ్ళని మేము ఈ విధంగా
తీసుకుంటున్నాం అనేసి ముందుగా ప్రణాళికలు గుర్తు చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో చక్కటి ఇల్లు కట్టుకొని
మన కుటుంబానికి మనకు కూడా వీలు జరుగుతుంది.

అదే విధంగా ఈరోజు కట్టుకున్న ఇల్లు త్వోరథదెత్తిన దాని వ్యాల్యూ పెరుగుతుంది భూమి వ్యాల్యూ పెరుగుతుంది
ఇంటి వ్యాల్యూ పెరుగుతుంది మనకు పర్మినెంట్ అడ్రస్ అనేది కూడా ఏర్పడుతుంది
ఇటువంటి జీవితానికి సంబంధించిన ముఖ్యంశము కాబట్టి మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని
ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

రాబోయే రోజుల్లో ఇంటి వ్యాల్యూ పెరగడం వల్ల లోన్స్ తీసుకొని పిల్లలు భవిష్యత్తుకి పునాది వేయడానికి కూడా
ఇది ఏర్పడుతుంది.

Residential Place తీసుకునే ముందు జాగ్రత్తలు

→ లోతట్టి ప్రాంతాల్లో తీసుకోకూడదు లోతు ఏరియాలో
తీసుకోవడం వల్ల వరదలు తుఫాన్లు వర్షాలు వచ్చినప్పుడు ఆ స్థలాలన్నీ నిండిపోతాయి ఆ నీరు
పోవడానికి చాలా కాలం పడుతుంది
→ స్మశానాలు మురుకు కాలవల దగరలో తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ తక్కువ రేట్ కి వచ్చినా కూడా
తీసుకోకూడదు

→ అదేవిధంగా నేల స్వభావం కూడా దృష్టిలో పెట్టుకోవాలి నేల లో చాలా రకాలు ఉన్నాయి ముఖ్యంగా
మెత్త నేల గట్టి నేల రాకింగ్ నేల ఎక్కువ మెత్త నేల ఉన్నట్లయితే పునాది కి ఎక్కువ డబ్బు ఖర్చు
పెట్టాల్సి వస్తుంది అదే గట్టి నేల లైతే పునాదికి తక్కువ ఖర్చు చేయవచ్చు రాకింగ్ నేల కు
కొన్ని కొన్ని ఇబందులు ఉంటాయి.

మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here