Regional Ring Road Hyderabad : ఎక్కువ భూమిని కోల్పోతున్న రాయగిరి గ్రామం

0
495
regional ring road hyderabad

గోరుచుట్టుపై రోకలిపోటు! మూడోసారీ వారే నిర్వాసితులు Regional Ring Road Hyderabad |రహదారి విస్తరణ, బస్వాపూర్ కాల్వ కోసం ఇప్పటికే భూ సేకరణ

• తాజాగా RRR Hyderabad కోసం చేపట్టిన సర్వే ఆ అడ్డుకుంటున్న రైతులు
• ఎక్కువ భూమిని కోల్పోతున్న RAIGIRI గ్రామం

Regional Ring Road Hyderabad కోసం తల పెట్టిన భూసేకరణ ప్రక్రియ ఓ ప్రహసనంగా తయారైంది.
యాదాద్రి జిల్లా భువనగిరి ఆర్డీవో పరిధిలో, మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతాల్లో కొందరు రైతులు మూడో సారి కూడా భూమిని కోల్పోతున్నారు.

దీంతో పలుచోట్ల అధికారులను అడ్డుకుని సర్వే చేసేందుకు ససేమిరా అంటున్నారు.
దీంతో పోలీసుల సహాయంతో సర్వే నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు అవతల నుంచి 158.645 కిలోమీటర్ల మేర Regional Ring Road Hyderabad ఉత్తర భాగాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.
భువనగిరి ఆర్డీవో పరిధిలోని రాయగిరి, కేసారం,పెంచకల్పహాడ్, తుక్కాపూర్, గౌస్నగర్,బల్లి గ్రామాల్లో రైతులు సర్వేను అడ్డుకుంటున్నారు.
ఈ ఆర్డీవో పరిధిలోని సుమారు 493 ఎకరాలను రైతులు కోల్పోనున్నారు. ఒక్క రాయగిరి గ్రామంలోనే 266 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది.

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పలువురు రైతులు గతంలో భూమిని కోల్పోయారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న కాల్వ కోసం మరికొంత భూమి పోయింది.
హైటెన్షన్ విద్యుత్తు సరఫరా కోసం విద్యుత్ టవర్లు పొలాల్లోంచి నిర్మించారు. ఒక్కో టవర్కు 17 నుంచి 30 కుంటల భూమి పోయింది.
టవర్ కింది భాగంలో వ్యవసాయం చేయలేని పరిస్థితి. తాజాగా RRR Hyderabad కోసం కూడా ఆయా గ్రామాల పరిధిలో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది.


పరిహారం ఎంత ఇవ్వాలనేది ఎక్కడికక్కడ నిర్ణయిస్తారు.

ఆ మూడు గ్రామాలను ఎందుకు తొలగించారో?

ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన Regional Ring Road షెడ్యూల్లో భువనగిరి ఆర్డీవో పరిధిలో RAIGIRI, భువనగిరి, కేసారం,పెంచకల్పహాడ్, తుక్కాపూర్, చందుపట్ల, గౌస్నగర్, యర్రంబల్లె, నందనం గ్రామాల మీదుగా
Regional Ring Road వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 24న జారీ చేసిన భూ సేకరణ చేయాల్సిన సర్వే నంబర్ల జాబితాలో భువనగిరి,చందుపట్ల, నందనం గ్రామాల ఊసే లేదు.
ఈ మూడు గ్రామాలను తొలగించడం వెనుక పెద్దల భూములు ఉండటమే కారణమన్నది.రైతుల ఆరోపణ. భువనగిరి పరిధిలోని పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు, ప్రముఖులకు చెందిన భూములు ఉండటంతోనే ఆయా గ్రామాలను తొలగించారని రైతులు చెబుతున్నారు.

మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here