ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ జీవితంలోని ఒక రోజు ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం.
Real Estate Agent జీవితం చాలా వైవిద్యంగా ఉంటుంది, వారంలో ఇన్ని గంటలని,
రోజుకి ఇంత సమయం అని మిగతా ఉద్యోగస్తుల వారికి సమయం తో సంబంధం లేదు. ఇది రెండు
వైపులా పదును ఉన్న కత్తి లాంటి పాత్ర. కాబట్టి ఎప్పుడు అందుబాటులో ఉండి చాకచక్యంగా,
ఎంతో చలాకీగా తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది.

Real Estate Agent ఒక సంస్థలో అయినా పని చేయొచ్చు లేదా సొంతంగా అయినా
పని చేయొచ్చు. ఎలా చేసిన వారు చేయాల్సిన పనులలో ఎక్కువ మార్పులు ఉండవు. సొంతంగా
రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా చేసేవాళ్ళు, తమ పనుల్లో కొన్నింటిని ఇతరులకు అప్పగించొచ్చు. ఫోన్
సంప్రదింపులు, ఆస్తి చూపే పనులు,.. ఇలా. ఈ రంగం లో కలుపుగోలుగా మట్లాడుతూ నెట్‌వర్క్ ని
పెంచుకోవడం చాలా అవసరం. అదే విధంగ క్లిష్ట పరిస్తితుల్లో కూడా ప్రశాంతంగా మెలగడం
అవసరం.

ఖాతాదారుడి సంతృప్తి (client satisfaction) ఎంతో ముఖ్యమైన ఈ రంగంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్
యొక్క కమ్యూనికేషన్ , అంటే మాట తీరు చాలా బాగుండాలి. అప్పుడె అతను ఖాతాదారులను
మెప్పించగలడు. మాట తీరుతో పాటు, తను పని చేస్తున్న రంగం లో వాణిజ్య,
గృహ,పరిశ్రమ,మొదలయిన వాటి మీద పూర్తి అవగాహన కూడా ముఖ్యం. ఎంత ఎక్కువ అవగాహన
ఉంటె అంత నేర్పుగా మాట్లాడి ఆస్తి కొనడానికి, లేదా అమ్మడానికీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్
క్లయింట్ ని ఒప్పించగలడు .ఏజెంట్స్ కస్టమర్స్ తో మాట్లాడేటపుడు వాళ్ళ స్థానంలో ఉండి వాళ్ళకి
ఎటువంటి అవసరం ఉందొ తెల్సుకొని, దానికి తగ్గ ప్రాపర్టీ ని చూపించాలి. ఇపుడు రియల్ ఎస్టేట్
లో జరిగే మోసాల వల్ల కస్టమర్స్ కి ఏజెంట్స్ మీదా నమ్మకం పోతుంది, కాబట్టి కస్టమర్స్ RERA
గుర్తింపు ఉన్న ఏజెంట్స్ దగ్గర మాత్రమే వెళ్తున్నారు,
కస్టమర్స్ ఒక చిన్న వస్తువు కొనాలి అన్నా 100 సార్లు ఆలోచిస్తారు, అలాంటిది ఒక పెద్ద మొత్తంలో
స్థిరాస్తిని కొనాలి అంటే చాలా ఎంక్వయిరీ చేస్తారు, ఆలోచిస్తారు, కాబట్టి కస్టమర్స్ కి చాలా
నమ్మకంగా ఉండాలి అలాగే వీళ్ళు చూపించే ఆస్తులు నిజమయినవి, నమ్మకమైనవి
అయ్యుండాలి.
రియల్ ఎస్టేట్ ఏజెంట్ రోజు వారి పనులు ప్లాన్ చేస్కోవడం చాలా అవసరం

ఈ రోజు యే క్లయింట్ ని కలవాలి? ఎంతమంది ఖాతాదారులతో అపాయింట్‌మెంట్
ఉందా? ఎంత మంది క్లయింట్స్ కి ప్రాపర్టీ ని చూపించే ప్రోగ్రాం ఉందా? క్లయింట్ తో చేయాల్సిన
పేపర్ వర్క్ ఏమైనా ఉందా? ఉంటే వాళ్ళకి కాల్ చేసి, అన్నీ పత్రాలు సిద్దంగా ఉన్నాయో లేవో
ఒకసారి తెల్సుకోవడం. మార్కెటింగ్ వైపు ఒక కన్నేసి ఉంచడం ఇలా చాలా వేరు వేరు పనులు
ఉంటాయి.
ఒక్కోసారి మనం అనుకున్న విధంగ పని జరగకపోవచ్చు, మనం చేయాల్సిన చాలా
పనులు క్లయింట్ మీద ఆధారపడి ఉంటాయి, వారు అందుబాటులో ఉండకపోతే అప్పటికప్పుడు
ప్లాన్ లో మార్చు చేయాలి. కాబట్టి అలాంటి అనివార్యమైన పరిస్థితులకు కూడా మనం తయారు
చేయాలి. ఉన్నట్టుండి క్లయింట్ ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ వాయిదా చేసినా, మన దగ్గర ప్లాన్
బి సిద్దంగా ఉండాలి.
Real Estate Agent ప్రతి రోజు చేయాల్సిన పనులు

- ఈమెయిల్స్, మెసేజ్ లు చెక్ చెయ్యడం
- అపాయింట్‌మెంట్ లూ అప్‌డేట్ చెయ్యడం
- ప్రాపర్టీ షో షెడ్యూల్ చెయ్యడం
- కొనుగోలు దారుల పత్రం పని సరిచూడడం
- స్థానికంగా అమ్మకానికి వచ్చిన ఆస్తులు శోధించటం
- మన సంస్థ లో జరిగే ప్రాపర్టీ సేల్స్ డేటాబేస్ తయారు చెయ్యడం,
- రియల్ ఎస్టేట్ లో మనం ఇచ్చే ఆఫర్లు వివరించడం
- అవసరమైన చోటా ప్రచారం చెయ్యడం,
- కొత్తగా డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వాటి తాలుకా సంప్రదింపులు
- చెయ్యడం,etc
ఈ రంగంలో అందరు సక్సెస్ అవలేరు, కస్టమర్లకి ఏజెంట్స్ మీద ఉండే నమ్మకమే అసలైన
సక్సెస్.ఆ సక్సెస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి కావాల్సిన లాభాన్ని అందిస్తుంది, అలాంటి సక్సెస్ ని
కనక రియల్ ఎస్టేట్ ఏజెంట్ డిజైన్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ రంగంలో ఒక మంచి
హోదా లో ఉండగలరు.
మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి