patanjali invest in telangana
Patanjali invest in Telangana :
ఆయిల్‌పామ్ రంగంలో పెట్టుబడులు పెట్టనున్న బాబా రాందేవ్ :
రాష్ట్రంలో పతంజలి గ్రూప్ త్వరలో భారీ పెట్టుబడులు పెట్టనున్నది. గ్రూప్‌నకు చెందిన రుచి సోయా సంస్థ ద్వారా ఆయిల్‌పామ్ సంబంధిత రంగంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు పతంజలి గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరు యోగా గురు బాబా రాందేవ్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు.
ప్రాసెసింగ్ మిల్లులు :
నల్లగొండ జిల్లాలో ఉన్న తమ నర్సరీలో ఇండోనేషియా-మలేషియా విత్తనాలను నాటి మొక్కల్ని పెంచుతున్నామని, వాటిని రైతులకు పంచుతామని రాందేవ్ చెప్పారు.
సూర్యాపేటలోనూ మరో నర్సరీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పెట్టేందుకు అనువైన స్థలాల కోసం చూస్తున్నట్టు చెప్పారు. రుచి సోయా కంపెనీకి హైదరాబాద్‌లో ఇప్పటికే బిస్కట్లు, కుకీస్ తయారు చేసే రెండు కాంట్రాక్ట్ యూనిట్లు ఉన్నాయని రాందేవ్ గుర్తుచేశారు. డిస్ట్రిబ్యూషన్ డిపోలు సైతం ఉన్నట్టు తెలిపారు. కాగా, పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.30 వేల కోట్లుగా ఉన్నది. ఎఫ్‌ఎంసీజీ సంస్థల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నది.
MEGA IT HUB IN HYDERABAD: 640 ఎకరాల్లో ఐటీ హబ్
‘తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు విషయంలో చురుగ్గా ఉన్నందున మేం కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నాం. త్వరలోనే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ ప్లాంటేషన్‌ను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఉన్నాం’ అని రుచి సోయా సీఈవో సంజీవ్‌కుమార్ అన్నారు.
ఆహార భద్రత, స్థిరమైన ఉత్పత్తి ప్రాధాన్యతలతో తెలంగాణ ప్రభుత్వ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉన్నది. ఈ పాలసీతో ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్, స్థానికంగా మౌలిక వసతులు పెరగడం, ఎగుమతి యూనిట్లు రావడంతోపాటు అన్నిటికిమించి ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగవుతాయి. పారిశ్రామికీకరణ కూడా పెరుగుతుంది. త్వరలోనే మా పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుంటాం’
బాబా రాందేవ్, పతంజలి గ్రూప్ వ్యవస్థాపకుడు
కరోనా ఉదృతి లోనూ సత్తా చాటుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్
Flat rates in Hyderabad after Covid ? కోవిడ్ తరవాత హైదరాబాద్ లో ఫ్లాట్ల రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా ?