Microsoft: తెలంగాణలో 2025 నాటికి మైక్రోసాఫ్ట్ భారీ డేటా కేంద్రం

0
137
Microsoft Company

Microsoft తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలా చేయూత.

Hyderabadలో రూ.15 వేల కోట్లతో Microsoft ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా కేంద్రం 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ సీఈవో.

సత్య నాదెళ్ల Telangana పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్కు తెలిపారు.
ఈ కేంద్రానికి సంబంధించిన పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. తెలంగాణలో అంకురాలకు, ఐటీ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. హైదరాబాద్కు వచ్చిన సత్య నాదెళ్లతో శుక్రవారం మంత్రి Ktr సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు భేటీ జరిగింది. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సత్యనాదెళ్ల మాట్లాడుతూ “ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పరివర్తనకు వేదికగా క్లౌడ్ ప్లాట్ఫారానికి డమాండ్ పెరుగుతోంది.

దీనిని పరిగణనలోనికి తీసుకొని సాంకేతికత పరంగా మరింతగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో మా సంస్థకు చెందిన అతిపెద్ద డేటా కేంద్రాన్ని
ఏర్పాటు చేస్తున్నాం. Microsoft చెందిన మొత్తం క్లౌడ్ పోర్ట్ఫోలియో, డేటాసొల్యూషన్స్, Artificial Intelligence, ప్రొడక్టివిటీ టూల్స్, పరిశ్రమలు, అంకురాలు, డెవలపర్ల కోసం అధునాతన సెక్యూరిటీ వ్యవస్థతో డేటాకేంద్రాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రపంచం నవీన సాంకేతికతలవైపు పరుగులు తీస్తోంది. ఇందులో Telangana ముందంజలో ఉంది. ఐటీ రంగంలో రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోంది. భారతీయులు త్వరలోనే ఐటీలో ఆధిపత్యవహించే స్థాయికి చేరుకుంటారు. టీహబ్ రెండో దశను ప్రారంభించడం అభినందనీయం. దాంతో కలిసి పనిచేస్తాం. తెలంగాణలో విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తాం” అని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ “ Telangana ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత వంటి కారణాలతో డేటా కేంద్రాల ఏర్పాటుకు కంపెనీలు Hyderabad వైపు మొగ్గుచూపుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తో పాటు అమె జాన్ సైతం రూ. 36 వేల కోట్లతో అతిపెద్ద డేటా కేంద్రాలను స్థాపిస్తోంది. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ గొప్ప సహకారాన్ని అందిస్తోంది.

@Satyanadella And @Krt

తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని ప్రారంభించడంతో పాటు డేటా కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం, వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంపై ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. తెలంగాణలో సానుకూలతల దృష్ట్యా మరిన్ని పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం అని అన్నారు. వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధి, Microsoft శిక్షణ కార్యక్రమాలు, Cloud Technologyతో చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాల, నూతన కేతికతలపై చర్చించుకున్నట్లు సమాచారం. హైదరాబాద్లో కృత్రిమమేధ మిషన్ ఏర్పాటు గురించి కేటీఆర్ వివరించారు. కాగా Bengaluruలో జరిగిన భవిష్యత్ సాంకేతికతల సన్నద్ధత సదస్సులో హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రస్తావించి, దానికి విశేష ప్రాచుర్యం కల్పించారని సత్యనాదెళ్లకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపినట్లు తెలిసింది.

Microsoft : Business, బిర్యానీల గురించి మాట్లాడుకున్నాం

Microsoft Hyderabad

@Satyanadellaతో తమ భేటీపై @Ktr ట్వీట్ చేశారు “ఈ రోజు శుభదినం. ఇద్దరు హైదరాబాదీలం సమావేశమయ్యాం. సంతోషంగా ఉంది.బిజినెస్, బిర్యానీ గురించి చర్చించుకున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here