హైదరాబాద్ లో హైటెక్ సిటీని మించి కొత్తగా సిలికాన్ వ్యాలీ ఏర్పాటు కాబోతుందా ?
అమెరికా సిలికాన్ వాలీని గుర్తుతెచ్చేలా ఇది ఉండపోతుందా? దేశంలోనే అతి పెద్ద ఐటీ హబ్ గా మారపోతుందా ?. టెక్ వర్గాల్లో జరుగుతున్న చేర్చ ఏంటి.?
హైదరాబాద్ ఐటీ కి కెర్రఫ్ గా మారింది. వరల్డ్ వైడ్ గా ఐటీ కంపెనీలు అన్ని భాగ్యనగరంలో తన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి ….
ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి లో ఏర్పాటు అయిన సాఫ్ట్ వేర్ కంపెనీలతో హైదరాబాద్ ప్రపంచ పాఠం లో నిలిచింది ….
తెలంగాణాలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఐటీ రంగం ఉపాధి కలిపిస్తుంది …. దీంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలిజీలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తుంది….
హైదరాబాద్ అడ్డాగా తెలంగాణ లో ఎన్నో ఐటీ కంపెనీలు వున్నాయి … హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ , మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్ , ఆదిభట్ల మొదలుకొని వరంగల్ హైవె లోని పోచారం వరకు ఎన్నో సాఫ్ట్ వేర్ కంపెనీ లు తమ కార్య కలాపాలు కొనసాగిస్తున్నయి…
హైదరాబాద్ నలుమూలలతో పటు రాష్ట్రము లోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ వెలుగులను విస్తరించేనందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది …
దీనిలో భాగంగా మహబూబ్ నగర్, వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం లో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు సృష్టిస్తుంది ….
సాఫ్టువేర్ రంగంలో టాప్ ప్లేస్ లో కనిపిస్తున్నా హైదరాబాద్ ఈ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిషగా అడుగులు వేస్తుంది…. దీని కోసం ఇప్పుడున్న హైటెక్ సిటీని మించి కొత్తగా ఐటీ హబ్ ఏర్పాటు చేయాలనీ నిర్ణయిచింది.అమెరికా సిలికాన్ వ్యాలీ తలపించేలా నిర్మించాలని ప్లాన్ చేస్తుంది.. దీనికోసం పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న సర్కార్ 640 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ నగరం ఏర్పాటు చేయబోతుంది ….
హైటెక్ సిటీకి సమీపం లో ఔటర్ రింగ్ రోడ్ కి అనుకోని ఈ కొత్త ఐటీ హబ్ రానుంది… కొత్త ఐటీ హబ్ కోసం సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు, ఈదులనాగుళ్లపల్లి , రంగారెడ్డి జిల్లా లోని కొండకల్ గ్రామాల పరిధిలోని 640 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది … దీనిని హైదరాబాద్ మెట్రో పొలిట్ అథారిటీ అద్వర్యం లో డెవలప్ చేయనున్నారు …. దీనికి అవసరమైన భూములను ల్యాండ్ పోలింగ్ విధానంలో సమీకరణించనుంది సర్కార్ ఆ భూములను తీసుకొని డెవలప్ చేసి భూ యజమానులకు ఎకరాకు 600 గజాల ప్లాట్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాటు తెలుస్తుంది …
640 ఎకరాల విస్తీర్ణం లోని ప్రాంతాన్ని బెంగుళూర్ తరహా లో సాఫ్ట్ వేర్ రంగానికి కేంద్రంగా చేయనుంది..
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో శువిశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థ, తాగునీరు ఇలా అంతర్ జాతీయ ప్రమాణాలతో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతుంది … దీని కోసం ఏరియా డెవలప్ మెంట్ ప్లాన్ రూపొందిస్తుంది ….. డెవలప్ చేసిన ప్లాట్ ను ఐటీకి సంబంధించిన కంపెనీలకు విక్రయించడం ధ్వారా ప్రభుత్వానికి వేళా కోట్ల ఆదాయం సమకూరడంతో పటు ఈ ఐటీ హబ్ ద్వారా
10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సర్కార్ అంచనా వేస్తుంది….
ప్రపంచ పటంలొ హైదరబాద్
ప్రపంచ పటంలొ హైదరబాద్ చేరింది.
ఈ ఘనత చంద్రబాబు గారిదె.
ఇంక ఈ థేశ అర్దిక రాజదాని గా
హైదరబాద్ అయ్యెరోజు కూడ
తొందరలోనె ఉన్నది.