కరోనా ఉదృతి లోనూ సత్తా చాటుతున్న హైదరాబాద్
రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ సత్తా చాటుతోంది. కరోనా ఉదృతి లోనూ ఇల్లు అమ్మకాల్లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో భాగ్యనగరమే టాప్ గా నిలిచింది. ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజి సంస్ధ Proptiger సంస్థ తాజా నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి – మార్చి లో హైదరాబాద్ హౌసింగ్ సేల్స్ 39 శాతం పెరిగినట్లు తేలింది
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వ్యాపార నిర్వహణ సులభతరంగా మారిందని ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ కు కలిసి వచ్చిందని Proptiger తమ నివేదికలో తెలిపింది
కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం డీల పడింది. బెంగళూరు ముంబై సహా పలు ప్రధాన నగరలన్ని ఇంకా కోలుకోలేదు కానీ గత కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్ రంగంలో సత్తా చాటుతున్న హైదరాబాద్ లాక్డౌన్ సమయం లోనూ ఇళ్ళ అమ్మకాల్లో దూసుకుపోతుంది
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో భాగ్య నగరమే టాప్ అని ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజి సంస్ధ Proptiger తమ తాజా నివేదిక real inside 1st quarter-2021 లొ వెల్లడించింది
గతంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్ హౌసింగ్ సేల్స్ 39 శాతం పెరిగినట్టు తేలింది. నిరుడు జనవరి-మార్చిలో 5554 ఇళ్ళ విక్రయాలు జరిగితే ఈ ఏడాది జనవరి మార్చిలో 7721 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. వీటి విలువ 8400 కోట్లని గత ఏడాదితో పోలిస్తే 34శాతం ఎక్కువ అన్నది.

ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ఇతర ఏ ప్రధాన నగరాల్లో అమ్మకాలు లేవని స్వస్టం చేసింది. యవత్ మార్కెట్ ను కరోనా వైరస్ ను షేక్ చేస్తున్న హైదరాబాద్ రియాలిటీ పై ఆ ప్రభావం కనబడటం లేదని తెలిపింది
కొండాపూర్, కొంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, సంగారెడ్డి లలో ఇళ్లకు మంచి డిమాండ్ కనిపించిందని proptiger తెలిపింది.
కూకట్పల్లి నిజాంపెట్ ల లో 50 లక్షల లోపు ఇళ్లకు గిరాకీ వుంటే, కొండాపూర్ మియాపూర్ కొంపల్లి లో 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య డిమాండ్ ఉంది
లాకడౌన్ లో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణరంగం పుంజుకోవడం వెనక ఒక ఆసక్తికర కారణం ఉంది, కరోనా తర్వాత దేశంలోని నిర్మాణ రంగ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు వ్యాపారాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి ముఖ్యంగా TS iPass, ఐ సి టీ పాలసీలు, వ్యాపార నిర్వహణను సులభతరంగా చేశాయి అందువల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి కొత్త ఉత్సాహం వచ్చిందని proptiger నివేదికలో పేర్కొంది.