> హైదరాబాద్ చుట్టుముట్టు మరో రెండు కొత్త లేఔట్ లను నెలకొల్పేందుకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ HMDA ప్లాన్ చేస్తుంది.
> ఉప్పల్ బాగాయథ్ , నియో పోలీస్ లాంటి వెంచర్లు hmda కు కానకవర్షం కురిపిస్తుండటంతో hmda సరికొత్త లేఔట్లపై ద్రుష్టి సారించింది .
> రంగరెడ్డి జిల్లా కొత్తూర్ మండలంలోని ఇన్ముల్ నార్వలో 75.39 ఎకరాల్లో కొత్త లేఔట్ నెలకొల్పేందుకు
Hmda అధికారులు కసరత్ షురూ చేసారు.
> అలగే కందుకూరి మండలం లేమూరు లో 77.37 ఎకరాల్ల భూమిని రైతుల వద్ద ఇప్పటికే సేకరించి వారితో ఒప్పందం చేసుకున్నారు లేఔట్ ల ప్రణాలికల ను కూడా తయారుచేసారు..
> అన్ని అనుకున్నాట్టు జరుగుతే వారం పది రోజులో, టెండర్లు పిలిచే అవకాశలున్నాట్టు తెలుస్తుంది …
> రైతుల వద్దనుంచి సేకరించిన భూములను లేఔట్లాగా డెవలప్ చేస్తారు.. డెవలప్ చేసిన ప్లాట్లలో 60% ప్లాట్లను భూములు ఇచ్చిన రైతులకు, 40% ప్లాట్లను Hmda తీసుకుంటుంది… తర్వాత తమ వాటాను hmda వేలం వేసి, ఆదాయం సమకూర్చుకుంటుంది …
> ఉప్పల్ బాగాయత్ లో 733 ఎకరాలు సేకరించారు , అందులో 104 ఎకరాలు Hmda , 40 జలమండలి, 10 ఎకరాలు శిల్పారామం , మరికొంత భూభాగాన్ని ఇతర అవసరాలకు కేటాయించారు …
> సుమారు 300 ఎకరాలను లేఔట్లు డెవలప్ చేసి రైతులకు ప్లాట్లను కేటాయించారు …. ఆ లేఔట్ లో మిగిలిన రెండో ఫేస్ లో అభివృద్ధి చేసిన 191 ప్లాట్ లను ఈ వేలం ధ్వారా విక్రయించగా 767 కోట్ల మేర ఆదాయం వచ్చింది…
> ఇందులో ఇంకా hmda కు 40 ఎకరాల భూమి వుంది … లేఔట్ డెవలప్మెంట్ పనులకు నిధులను స్వాంతగానే సమకూర్చుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పడంతొ Hmda ల్యాండ్ పుల్లింగ్ పై ద్రుష్టి కేంద్రీకరించింది … ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చేలా రైతుల వాటాలను 60%కి పెంచింది ….
> కాంపౌండ్ వాల్ , కంచె లాంటి రక్షణ చర్యలు తీసుకుంటుంది … నాలా, భూ వినియోగ మార్పిడి, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, ఇతర ఖర్చులను సైతం భరిస్తుంది…
> ఐతె యాదాద్రి భునగిరి జిల్లాలోని చౌటుప్పల్, దండుమల్కాపురం లో, మేడ్చల్ జిల్లా కిసారం మండలం బోగారం సర్వే చేసినప్పుడు రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతొ ఈ రెండు చోట్ల లేఔట్ ప్రతిపాదనలు ఆగిపోయాయి.