ఈ ఏడాది దేశంలో House Sale ఇండ్ల అమ్మకాలు రికార్డుస్థాయిలో జరగ్గా,
అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2022 సంవత్సరంలో దేశంలోని ఏడు
ప్రధాన నగరాల్లోకెల్లా హైదరాబాద్లో గృహ విక్రయాలు అత్యధికంగా 87 శాతం వృద్ధిచెంది
నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదికలో వెల్లడించింది. వడ్డీ రేట్లు
పెరిగినప్పుటికీ ఈ ఏడాది భారత్లోని ఏడు నగరాల్లో 3.65 లక్షల యూనిట్ల రికార్డు గరిష్టస్థాయి.
House Sale గృహ విక్రయాలు జరిగాయని, 2014లో నమోదైన రికార్డును మించడం విశేషమని అన
రాక్ తెలిపింది. ప్రధాన ఏడు నగరాల్లో 2014 లో 3.43 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఆ సంఖ్యను మించి 2022లో విక్రయాలు జరిగాయని నివేదిక వెల్లడించింది. ముడి ఉత్ప
త్తుల వ్యయం అధికంకావడంతో రెసిడెన్షియల్ ఆస్తుల ధరలు 4 నుంచి 7 శాతం పెరిగినా,
కొవిడ్ సంక్షోభం తదుపరి డిమాండ్ ఊపందుకుందని పేర్కొంది. వివరాలు

● అనరాక్ నివేదిక ప్రకారం హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీ ఆర్.ముంబై మెట్రోపాలిటిన్
రీజియన్ (ఎంఎంఆర్), చెన్నై, కోల్ కతా, బెంగళూరు, పుణె వంటి
ఈ ఏడు నగరాల్లో కలిపి 2021లో 2,36,516 గృహ విక్రయాలు జరగ్గా, 2022లో
54 శాతం వృద్ధితో 3,64,873 అమ్మకాలు నమోదయ్యాయి. ● ముంబై మెట్రోపాలిటిన్ (ఎంఎంఆర్)లో ఈ ఏడాది 1,09,733 యూనిట్ల విక్రయాలు జరగ్గా,
2021కంటే 44 శాతం వృద్ధిచెందాయి. ● హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు మాత్రం భారీ వృద్ధిని నమోదుచేశాయి. తెలంగాణ
రాజధానిలో ఈ ఏడాది విక్రయాలు 87 శాతం వృద్ధిచెంది 47,487 యూనిట్లకు
పెరిగాయి. 2021లో 25,406 యూనిట్లు అమ్ముడయ్యాయి.
● ఎంఎంఆర్ మార్కెట్లో గత ఏడాది అమ్మకాలు 76,396 యూనిట్లు, ఢిల్లీ-ఎన్సీఆర్
అమ్మకాలు 59 శాతం వృద్ధితో40,053 యూనిట్ల నుంచి 63,712 యూనిట్లకు పెరిగాయి.
● విక్రయాల వృద్ధిలో హైదరాబాద్ తదుపరిస్థానాన్ని కోల్కతా(62 శాతం) నమోదుచేసింది.
ఏడు నగరాల్లోకెల్లా కనిష్ఠ వృద్ధి చెన్నై (29 శాతం) నమోదయ్యింది. 2022లో
ఈ తమిళనాడు నగరంలో అమ్మకాలు 16,097 యూనిట్లకు పరిమితమయ్యాయి.
● కోల్కతాలో రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాలు 62 శాతం వృద్ధి చెంది 13,077 యూనిట్ల
నుంచి 21,220 యూనిట్లకు పెరిగాయి.
House Sale గృహ విక్రయ వృద్ధిలో టాప్

కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాద్, ఎంఎంఆర్ దే అగ్రస్థానం
ఏడు ప్రధాన నగరాల్లో కొత్త ప్రాజెక్టుల ద్వారా నిర్మాణమైన ఇండ్లు 2022లో 3,57,600 యూనిట్లకు
చేరాయని అసరాక్ వెల్లడించింది. 2021లో నమోదైన 2,36,700 యూనిట్లకంటే ఈ ఏడాది 51
శాతం పెరిగాయి. ఈ నగరాల్లో హైదరాబాద్, ఎంఎంఆర్ నే కొత్త రెసిడెన్షియల్
యూనిట్లు అధికంగా వచ్చాయన్నది. ప్రాపర్టీధరల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు,
బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తదితర సమ స్యలున్నప్పటికీ, రెసిడెన్షియల్
రియల్ ఎస్టేట్కు 2022లో శుభసంవత్సరంగా గడిచిందని అనరాక్ గ్రూప్ చైర్మన్
అనుజ్ పురి చెప్పారు.ఏడు ప్రధాన నగరాల్లో విక్రయం జరగని యూనిట్ల నిల్వ
గత ఏడాది. కంటే 1 శాతం తగ్గి 6,30,953 యూనిట్లకు దిగివచ్చినట్టు కన్సల్టెన్సీ
సంస్థ వెల్లడించింది. 2013-14 నుంచి రియల్ ఎస్టేట్ రంగం ఆటుపోట్లను
ఎదుర్కొంటున్నదని, అయితే 2022 ఏడాది గొప్ప ఊరటనిచ్చిందని తెహన్ గ్రూప్ మేనేజింగ్
డైరెక్టర్ హర్ష త్రైహన్ పేర్కొన్నారు.

నగరాలవారీగా గృహ విక్రయాలు
నగరం | 2022 | 2021 | వృద్ధి శాతం |
ఎన్సిఆర్ | 63,712 | 40,053 | 59 |
ఎంఎంఆర్ | 1,09,733 | 76,396 | 44 |
బెంగళూరు | 49,478 | 33,086 | 50 |
పుణె | 57,146 | 35,975 | 59 |
హైదరాబాద్ | 47,487 | 25,406 | 87 |
చెన్నై | 16,097 | 12,525 | 29 |
కోల్కతా | 21,220 | 13,077 | 62 |
మొత్తం | 3,64,873 | 2,36,516 | 54 |
మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి