ఫార్మ్ ల్యాండ్ లేఅవుట్ ల కి తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది
• ఇక నుండి ఫార్మ్ ల్యాండ్ వెంచర్ లో ప్లాట్ కొనాలి అంటే ఆ ప్లాట్ సైజు కనీసం ఇరవై గుంటలు ఉంటేనే ఆ ప్లాట్ ని రిజిస్ట్రేషన్ చేస్తారు .
• ఒకవేళ ఆ లేఔట్ లో ప్లాట్ ల సైజు లు ఇంతకన్నా తక్కువ ఉంటే దాన్ని unapprove లేఔట్ గా పరిగణించి ఇక నుంచి రెజిస్ట్రేషన్స్ చేయరు.
• తెలంగాణ మున్సిపల్ ఆక్ట్ 2019,తెలంగాణ పంచాయతీ రాజ్ 2018 ప్రకారం
ఏదైనా ఒక ల్యాండ్ రోడ్లు ప్లాట్ గా విభజన చేస్తే..
దానికి competent అథారిటీ దగ్గరి నుంచి పర్మిషన్ తీసుకవచ్చి ప్లాట్లాగా డివైడ్ చేసి చదరపు గజాలలో అమ్ముకోవాలి … రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ఈ ఆక్ట్ చెపుతున్నాయి..
• అప్రూవల్ లేకుండా లేఔట్లను డెవలప్ చేయకూడదు , అందులో వున్నా ప్లాట్ లను అమ్మకూడదు, అమ్మిన రిజిస్ట్రేషన్ చేయకూడదు.
ఇలా రిజిస్ట్రేషన్ కు, అప్రూవల్ కి ఇబ్బంది అవుతుంది అనే చాల మంది ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ తో వెంచర్స్ వేస్తున్నారు …
• ఫార్మ్ ల్యాండ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని అర్ధం
అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పర్మిషన్ అవసరం లేదు.
ఈ ఫార్మ్ లేఔట్ లోని ప్లాట్ లను గజాలలో అమ్ముతే రెసిడెన్సల్ కిందికి వస్తుంది అని, గుంటలలో అమ్ముతున్నారు … వీటికి పాసుబుక్ లు తీసుకుంటున్నారు రైతు బంధు కూడా వస్తుంది.
• అయితే తెలంగాణా గవర్నమెంట్ వీటికి బ్రేక్ లు వేసింది. ఇక నుండి ఆ ఫార్మ్ లేఔట్లో ప్లాట్ సైజు కనీసం ఇరవై గుంటలు ఉంటేనే దాన్ని ఫార్మ్ లేఔట్ కింద పరిగణిస్తారు .
రెజిస్ట్రేషన్స్ కూడా చేసుకోడానికి అనుమతిస్తారు..
• ఒకవేళ ఫార్మ్ లేఔట్ ప్లాట్ సైజు 2420 Sq yards అంటే ఇరవై గుంటల కంటే తక్కువ ఉంటే దాన్ని రెసిడెన్సల్ లేఔట్ కిందకి పరిగణిస్తారు … దానికి compitent అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి .