Flat rates in Hyderabad after Covid ?
సొంతింటి కల
సొంతింటి కల నిజం చేసుకునేందుకు సగటు నగరవాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జీవితకాలం కష్టపడిన సొమ్ము తో ఒక ఫ్లాట్ కొనుక్కోగలిగితే ఆ కుటుంబంలో ఉండే సంతోషం వేరు. అయితే సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు కుటుంబంలో ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి..
ఏడాది కాలం గా చూస్తే కరోనా లాక్డౌన్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల నిలిపివేత కారణంగా హైదరాబాదులో ఇల్లు, ప్లాట్లు క్రయ విక్రయాలు మందకొడిగా సాగాయి. అయితే ఇటీవల కాలంలో అమ్మకాల వేగం పెరిగింది. కానీ అంతే సమానంగా ప్లాట్లు రేట్లు ఇళ్ళ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి …
స్టీలు సిమెంటు ధరల పెరుగుదల


ఒకవైపు స్టీల్, సిమెంట్ ధరలు ఆకాశానికి చేరడం కరోనా విపత్కర పరిస్థితిలో లేబర్ కొరత ముడిసరుకు ధరలు పెరిగిన నేపథ్యంలో ప్లాట్లు ధరలు పెంచక తప్పడం లేదని బిల్డర్స్ చెబుతున్న మాట
స్టీల్ సిమెంట్ ధరలు బాగా పెరిగాయి, స్టీల్ ధర చూసుకుంటే కేజీకి Rs16 నుంచి Rs20 కి పెరిగింది, అదే సిమెంట్ చూస్తే Rs220 నుంచి Rs250 ఉండగా ఇప్పుడు Rs320 నుంచి Rs350 వరకు పెరిగింది.
కరోనా లాక్డౌన తర్వాత ఉహించని రీతిలో ఫ్లాట్ల ధరలు తగ్గుతాయని ఒక చర్చ జరిగింది, కానీ దానికి భిన్నంగా ఫ్లాట్ల రేట్లు పెరిగిపోతున్నయి ఈ పరిస్థితులు ఫ్లాట్ల కొనుకోవలనుకునేవల్లు ఎంత దరకైన కొనేందుకు సిద్ధపడల్సిన పరిస్థితి వచ్చేసింది.
ఇటుక కంకర ఇసుక ధరల పెరుగుదల

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 6 నెలల క్రితం నిర్మాణంలో ఉన్న భవనం sft ధర చూస్తే Rs 3800 ఉండగా ఇప్పుడు నిర్మాణం పూర్తి చేసుకున ఫ్లాట్ ధర Rs5000 వరకు చెబుతున్నారు. ఇక Read to move ఫ్లాట్ల ధరలు మరింత పెరిగి పోయాయి .. lockdown తరవాత భావన నిర్మాణ వ్యయం 20శాతం పెరిగినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. భవన నిర్మాణం లో వినియోగించే 71 రకాల వస్తువుల్లో అన్నింటి ధరలు పెరిగిపోయాయని చెప్తున్నారు.
నిర్మాణ కార్మికుల కొరత :

లాక్ డౌన్ సమయంలో ఊర్లోకి వెళ్లిన కార్మికులు ఎక్కువ మంది తిరిగి రాలేదు దీంతో కొద్ది గొప్ప వచ్చిన లాబార్ తోనే పనులు చేయించాల్సి వస్తుందంటున్నారు.
దినసరి వేతనాలు పెంచాలని వారు developers మీద ఒత్తిడి పెంచుతున్నారు పెట్రోలు ధరల పెంపు నిర్మాణ రంగం పై ప్రభావం చూపుతున్నది
వర్క్ ఫ్రొం హోమ్ ప్రభావం

కొవిడ్ మహమ్మారి పంజా విసరడంతో వర్క్ ఫ్రం హోం పని విధానం అమల్లోకి వచ్చింది దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సొంత ఇల్లు కొనుగోలు పై దృష్టి సారించారు 2bhk ఉన్న వాళ్ళు 3bhk కోసం, 3bhk ఉన్న వాళ్ళు 4 bhk కోసం విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయని చెబుతున్నారు.కొన్ని సంస్థలు నిధుల సేకరణ కోసం ఫ్రీలాన్స్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి వాటి ధరలు సైతం ఇటీవల కాలంలో భారీగా పెంచారు.
Flat rates in Hyderabad after Covid ?
హైదరాబాద్ నగరం పలు ప్రాంతంలో ఫ్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Hyderabad (Areas) | Price per sft (2020) | Price per Sft (2021) |
Uppal | 4000-4500 | 5000-5500 |
Malkajgiri | 4000-4500 | 4500-5000 |
Nizampet Pragathinagar Kompally | 5500-7000 | 7000-7500 |
Secunderabad Seethafalmand | 4500-5000 | 5500-6000 |
LB Nagar | 6000-6500 | 6500-7000 |