లిథియం అయాన్ బ్యాటరీల గిగా కర్మాగారం, పరిశోధన కేంద్రం ఏర్పాటు

Amararaja In Telangana
• రూ.9,500 కోట్ల పెట్టుబడి..
4,500 మందికి ఉపాధి
• రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
• అన్ని విధాలా అండగా
ఉంటాం: మంత్రి కేటీఆర్
• తెలంగాణ పెట్టుబడులకు
అనుకూలం: గల్లా జయదేవ్
ప్రసిద్ధ బ్యాటరీల తయారీ సంస్థ Amararaja In Telanganaలో అడుగుపెట్టనుంది. దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. మహబూబ్నగర్ లోని దివిటి పల్లి పారిశ్రామిక పార్కులో రూ.9,500 కోట్ల పెట్టుబడులతో దీనిని స్థాపించి, ప్రత్యక్షంగా
4,500 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో అమరరాజా.

బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ తరపున చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గల్లా జయదేవ్, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు సమక్షంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అమరరాజా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేనిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని, రెండే మొదటి దశ పూర్తిచేసి ఉత్పత్తులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ వెల్లడించారు.
కేటీఆర్ కోరిక మేరకే
Amararaja In Telanganaలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ గత కొన్నేళ్లుగా కోరుతున్నారు. ఇప్పటికి ఆ ప్రయత్నం ఫలించింది. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, విధానపరమైన అంశాలను విశ్లేషించాం.
ఈవీ వాహనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ అనుకూలంగా విధానాలు ఉన్నాయి.
అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఒప్పందం ఈ అమరరాజాకు కీలక ముందడుగు.
– గల్లా జయదేవ్, సీఎండీ, అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్.
Amararaja In Telangana ఈవీ తయారీ హబ్ గా రాష్ట్రం
దేశంలోనే తొలి లిథియం అయాన్ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని తెలంగాణలో నెలకొల్పడం జయదేవ్ దార్శనికతకు
ఈ పరిశ్రమ పెట్టుబడుల అత్యాధునిక సెల్ సాంకేతికతలోనూ మొదటిది.
తెలంగాణ ఈవీ తయారీ హబ్ గా మారేందుకు అమరరాజా కర్మాగారం దోహద పడుతుంది.
– మంత్రి కేటీఆర్
తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం సంచాలనకుడు సుజయ్ కారంపురి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, అమరరాజా విద్యుత్ విభాగం అధ్యక్షుడు సముద్రాల విజయానంద్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్తూరు బయట తొలి కర్మాగారమిదే
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గల్లా జయదేవ్ మాట్లాడారు. “ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 37 సంవత్సరాలుగా అమరరాజా పరిశ్రమలు నడుస్తున్నాయి. దాని బయట ఏర్పాటు చేయబోయే మొదటి పరిశ్రమ గిగా కారిడార్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. పెట్టుబడులకు తెలంగాణ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతం. ఈ రాష్ట్రంతో ఎప్పట్నుంచో అనుబంధం ఉంది. మా కార్పొరేటు కార్యాలయం హైదరాబాద్ లోనే ఉంది. ఈ సర్కార్ తో కలిసి
పనిచేయడం సంతోషంగా ఉంది.
గత ఏడాది రూపొందించుకున్న ‘ఎనర్జీ అండ్ మొబిలిటీ’ రోడ్ మ్యాపనకు అనుగుణంగానే తాజా ముందడుగువేశాం.
ఎనర్జీ అండ్ మొబిలిటీలో భవిష్యత్ సాంకే తికతల కోసం ఆర్ అండ్ , ఇంక్యుబేషన్, టెస్టింగ్,
తయారీలతో కూడిన గీగా కారిడార్ పటిష్ఠ భారతీయ పర్యావరణ వ్యవస్థ (ఎకోసిస్టమ్)ను అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష.
ఇక్కడి యువతకు ఉపాధి నూతన సాంకేతికతతో ఏర్పాటు కాబోయే బ్యాటరీల.
తయారీ యూనిట్ అందరి ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నాం. పదేళ్లలో రూ.9,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలో భాగంగా వెంటనే నిర్మా పనులు చేపడతాం. తద్వారా కర్మాగార సమీపంలోని గ్రామీణులతోపాటు రెండు, మూడో తరగతి పట్టణాల్లో వలసలను నివారించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తాం.

ఇతర సంస్థలకూ ఉపయోగకరం
శంషాబాద్ వద్ద ఏర్పాటయ్యే సాంకేతిక కేంద్రం మెటీరియల్ రీసెర్చ్, ప్రొటోటైపింగ్, ప్రొడక్ట్ లైఫ్
సైకిల్ అనాలిసిస్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డిమానేషన్ కోసం అధునాతన ప్రయోగశాలలు, ఇతర మౌలిక వసతులను కలిగిఉంటుంది. విద్యుత్, వాహన రంగాల్లోని సంస్థలకు పలు రకాల సదుపాయాలను అందిస్తుంది. ఇప్పటికే అమరరాజా ఇ-హబ్న ఏర్పాటుచేసింది. ఆసక్తి ఉన్న సంస్థలతో కలసి ఇది పని చేస్తుంది. 3న అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటు చేసి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం.
చిత్తూరులోని పరిశ్రమలు యథాతథం
Amararaja In Telanganaలో కొత్త పరిశ్రమ ప్రారంభించినా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మా పరిశ్రమలు యథాతథంగా కొనసాగుతాయి. ఏపీతో పారిశ్రామిక అనుబంధం కొనసాగుతుంది.
అక్కడ ఉన్న అమరరాజా పరిశ్రమల వద్ద ఎలాంటి కాలుష్య సమస్యల్లేవు. పరిశ్రమలు నిర్వహిస్తున్న స్థలంలోనే ఎప్పటి నుంచో మా కుటుంబం నివసిస్తోంది.
అక్కడ కాలుష్యం ఉంటే మా కుటుంబంపైనే ఆ ప్రభావం పడేది.
పరిశ్రమల వద్ద కాలుష్య సమస్యలు లేకుండా మేము ముందే అన్ని జాగ్రత్త
చర్యలు తీసుకున్నాం” అని జయదేవ్ తెలిపారు.
Amararaja In Telangana ఎనిమిదేళ్ల కృషి

ఫలించింది: మంత్రి కేటీఆర్ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తమ ఎనిమిదేళ్ల కృషి ఇప్పటికీ ఫలించిందన్నారు.
ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన గల్లా జయదేవక్కు ధన్యవాదాలు తెలిపారు. “అమరరాజాకు గొప్ప చరిత్ర ఉంది. జయదేవ్ నాకు సన్నిహితుడు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ పరిశ్రమను స్థాపించాలని కోరుతున్నా.
తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పుడు భారీ పెట్టుబడులతో ముందుకొచ్చారు. అమరరాజా కంపెనీకి అన్ని విధాలుగా అండగా ఉంటాం.
ఇప్పటికే తెలంగాణ విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి ప్రత్యేక విధానం తెచ్చింది. ఈ రంగంలో భారీ పెట్టు బడులను సమీకరిస్తోంది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అభివృద్ధికి, గామీణ ప్రాంత యువతకు ఉపాధికి ఊత మివ్వడంతోపాటు దేశంలో ఈవీ విప్లవానికి నాందిపలుకుతుందని” కేటీఆర్ అన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో కర్మాగారం
తెలంగాణలో నెలకొల్పబోయే పరిశ్రమ 16 జీడబ్ల్యూహెచ్ లిథియం సెల్, 5 జీడబ్ల్యూహెచ్ బ్యాటరీ
ప్యాక్ యూనిట్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దానికి అనుబంధంగా ఆధునిక అభివృద్ధి, పరిశోధన
కేంద్రం ఉంటుంది. శంషాబాద్ వద్ద రూ.800 కోట్లతో సాంకేతిక కేంద్రాన్నీ
ఏర్పాటుచేస్తాం. అందులో 800 మందికి ఉపాధి కల్పిస్తాం.
మంత్రి కేటీఆర్ను సత్కరిస్తున్న గల్లా జయదేవ్
– నగల్లా జయదేవ్, సీఎండీ, అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్
మరి కొన్ని హైదరాబాద్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
హైదరాబాద్ బెస్ట్ హౌసెస్ ధరల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి