Mortigage Loan : మోర్ట్ గేజ్ లోన్ అంటే ఏమిటి ?

0
145
MORTIGAGE LOAN

mortigage loan మోర్ట్ గేజ్ లోన్ అంటే ఏమిటి ?


mortigage loan అంటే తాకట్టు లేదా పూచీకత్తు అనే ఆర్డమోస్తుంది

• భవన నిర్మాణ పరిబాసలో చెప్పాలంటే మున్సిపాలిటీ యొక్క నియమనిబంధనలు లోబడి ఉంటామని చెప్పడమే మోర్ట్ గేజ్ (పూచీకత్తు తాకట్టు ) అంటారు ..
• మోర్ట్ గేజ్ రెండు రకాల సబ్జెక్టులతో ఉన్నవాళ్ళు చేయవలసి వస్తుంది …

• మొదటది భవన నిర్మాణ అనుమతులకు వెళ్ళినప్పుడు. భవనం యొక్క ఎత్తు 7 మీటర్లకి మించి అంటే రెండు అంతస్తులకన్నా పైబడిన నిర్మాణాల అనుమతులకు వెళ్ళినప్పుడు, Build up ఏరియాలో పది శాతంని + స్థలం యొక్క పది శాతాన్ని రెండు కలిపి మున్సిపల్ పేరిట మోర్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు.

రెండవది స్థలం యొక్క కొలత 300 మీటర్లు పైబడి ఉన్నప్పుడు కూడా మోర్ట్ గేజ్ నిబంధనలు తప్పని సరి….

ఎందుకోసం మోర్ట్ గేజ్?

• భవన నిర్మాణం కోసం మనం పొందు పరచిన ప్లాన్ లోని నిబందనలు అనుసరించి రూల్స్ అండ్ రేగులషన్స్ ని తూచ తప్పకుండ ప్లాన్ ప్రకారం కడుతామని ఒక హామీ లాగా ఇవ్వడం ….
• మోర్ట్ గేజ్ రీలీజ్ ఎప్పుడు అవుతాది అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ ఐన తర్వాత ఆన్లైన్ ధ్వారా మార్ట్ గేజ్ రీలీజ్ కి అప్లై చేసుకోవచ్చు….
•ఆలా భవన నిర్మాణ పనులు అన్ని పూర్తిఅయ్యాక.
భవన నిర్మాణ శాఖ నుంచి ఒక సంబంధిత ఆఫీసర్ ని తీసుక వచ్చి రూల్స్ ప్రకారం మనం నిర్మాణం చేసామా ? లేదా అనేది చెక్ చేయించిన తర్వత తిరిగి మోర్ట్ గేజ్ కాన్సలేషన్ లేదా
మోర్ట్ గేజ్ రీలీజ్డ్ ప్రక్రియ పూర్తి అయ్యినట్టు..

బ్యాంకు లోన్ సందర్భంలో :

• మొదట బ్యాంకుకి ఆస్థి యొక్క డాక్యుమెంట్స్ ని పర్మిషన్ ఒరిజినల్స్ ఇచ్చేసి బ్యాంకు మేనేజర్ పేరిట దాన్ని మోర్ట్ గేజ్ చేస్తారు. బ్యాంకు లోన్ తీసికుంటారు….
• గడువులో లోన్ మొత్తాన్ని పూర్తిగా కట్టేసీన తర్వాత
ఆ బ్రాంచ్ మేనేజర్ చేత కాన్సలేషన్ డిడ్ లేదా రిలీజ్ డిడ్ తప్పకుండ చేయించినప్పుడే బ్యాంకుతో మీకు ఉన్నటువంటి సంబంధాలు అన్ని కూడా తెగిపోయినట్టు ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here