తెలంగాణ లో Regional Ring Road ఉత్తరభాగానికి కదలిక వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద 100 కోట్ల రూపాయలు రహదారుల సంస్థకు డిపాజిట్ చేసింది. తొలి విడతలో సంగారెడ్డి నుంచి తూప్రాన్ వరకు 60 కిలోమీటర్స్ మేర రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సమస్త కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది.

ఈ ఏడాది ప్రభుత్వం 100 కోట్లు డిపాజిట్ చేసి, మిగిలిన మొత్తాన్ని దశల వారీగా చెల్లించేందుకు సుమకథ వ్యక్తం చేయడంతో ఒప్పందానికి కేంద్రం ముందుకొచ్చింది. జాతీయ రహదారి సంస్థ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం జరగాల్సి ఉంది.ఆ తర్వాత భూ సేకరణ చేయబడతారు. అనంతరం రహదారి నిర్మాణానికి సవివరణ వేదిక అంచనాలను సిద్ధం చేసి కేంద్రం ఆమోదానికి పంపుతారు.
అందుకు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని అంచన. Regional Ring Road రెండు భాగాలుగా 360 కిలోమీటర్లు మేర నిర్మాణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించాయి.
RRR కు భూసేకరణ
ఉత్తర భాగంలో 4 వేల 760 కిలోమీటర్లు మేరకు భూసేకరణ, సర్వే నిర్వహణ కేంద్రం వివిధ నోటిఫికేషన్ జారీ చేసింది.భూసేకరణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భావించాలి, రహదారి నిర్మాణం వ్యయం మాత్రం కేంద్రమే పూర్తిగా భరిస్తుంది. ఉత్తరభాగానికి ప్రభుత్వం 1200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగానే 100 కోట్లు డిపాజిట్ చేసింది ఒప్పందం తర్వాత తొలి దశలో సంగారెడ్డి నుంచి తూప్రాన్ వరకు 60 కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణానికి రంగం సిద్ధమైంది.

అందుకోసం సుమారు 260 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. త్వరలో భూ సేకరణ కోసం యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. ప్రభుత్వం నిధులు డిపాజిట్ చేసిన ప్రతిసారి కొంత మేరా రహదారి నిర్మాణం ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. భూసేకరణ వ్యయంలో రాష్ట్ర వాటా చెల్లించేందుకు గత బడ్జెట్ లు 500 కోట్లు కేటాయించింది. కేంద్రం పలుమార్లు లేఖలు రాయడంతో కొంత మొత్తాన్ని విడుదల చేయడంతో ప్రాంతీయ రింగురోడ్డుకు కదలిక వచ్చింది. ఉత్తరభాగంలో 182 కిలోమీటర్ల రహదారిని 11 భాగాలుగా విభజించే మార్గంలో సర్వే నిర్వహించి భూ యజమానులను గుర్తించేందుకు నాలుగు దఫాలుగా కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ఏడాదిలోగా ఆ ప్రక్రియను పూర్తి చేసి భూ సేకరణకు వీలుగా తుది నోటిఫికేషన్స్ జారీ చేయాల్సి ఉంది. జోగిపేట, వేలాద్రి, చౌటుప్పల్, రెవెన్యూ పరిధిలో సర్వే నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది పూర్తి కావడంతో ఆయా ప్రాంతాలకు భూసేకరణ నోటిఫికేషన్ ను కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాలకు ఈ ఏడాది చివరి వరకు వ్యవధి ఉన్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు.
Also, Read This Latest Blogs:
1.RRR New Update: భారతమాల-2లో RRR దక్షిణ భాగం
2.మీకు తెలుసా- RBI రూ.2000 నోటును ఎందుకు రద్దు చేసింది?
3.Janagaon Real Estateలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
Question and Answers
1.పూర్తి పేరు ఏంటి?
A: ప్రాంతీయ రింగ్ రోడ్డు or Regional Ring Road
2.RRRను ఏ ప్రాజెక్ట్ లోకి చేర్చారు?