• కోకాపేటలో భూములు అమ్మి ఖజానా నింపుకున్నాం అని సంబరపడుతున్న తెలంగాణ సర్కార్ కు షాక్ కి గురి చేసే పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి.
• ఈ భూముల వేలం వ్యవహారం హైకోర్టు మెట్లు ఎక్కింది. సర్కార్ పై కన్ను ఎర్ర చేసింది అవసరం ఐతే వేలం ద్వారా సంపాదించుకున్న 2000కోట్లను తిరిగి ఇచ్చెయందుకు తయారుగ ఉండాలని వార్నింగ్ ఇచ్చింది లేదంటే థర్డ్ పార్టీ ఖాతాలో ఆ సొమ్ముని ఉంచాల్సివస్తుంది అని హెచ్చరించింది.
• దీనితో కోకాపేట భూముల విషయంలో ఎప్పుడు ఏము జరుగుతుందేమో అని అయోమాయం నెలకొంది. అవసరం ఐతే కోకాపేట భూవేలం ప్రక్రియను నిలిపి వేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది.
• వట్టినాగులపల్లి లోని తమ భూముల సర్వే నంబర్లను జీవో 111 పరిధినుంచి తొలగించాలని కోరుతు ఆజ్ఞే అగ్రీటెక్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం చీఫ్ జస్టిస్ హిమకోహ్లీ , జస్టిస్ విజయసేన్ రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
• హిమాయత్ సాగర్ హూస్మన్ సాగర్ జంటజలశయాల క్యాచ్మెంట్ ఏరియాలోని 80 గ్రామాలలో ఒకటైన వట్టినాగుల పల్లిలో భహుళ అంతస్థుల నిర్మాణాలకు అనుమతి ఇస్తే ఆ జలశయాలు వాటి పరివాహక ప్రాంతాలు దెబ్బతింటాయని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొనేదాన్ని హైకోర్ట్ తీవ్రంగా పరిగణించింది.
• వట్టినాగులపల్లి సమీపంలోని కోకాపేట భూములను ప్రభుత్వం వేలం నిర్ణయించి 2000 కోట్లను ఆర్జించింది అని అక్కడ బహుళ అంతస్థుల భవనాలను నిర్మాణాలకు యోగ్యం అని కోకాపేట భూముల పై దాఖలైనవి అని ప్రభుత్వం ఎలా చెప్పుతున్నది అని ప్రశ్నించింది.
• కోకాపేట ఏరియాలో లేని అభ్యతరం వట్టినాగులపల్లి భూముల విషయంలో ఎందుకు ఉంటుంది అని నిలదీసింది. ప్రభుత్వం ద్వంద వైకారిని అవలంబిస్తే ఉపేక్షించపొమని అవసరం ఐతే కోకాపేట పిన్ తొ వట్టినాగులపల్లి రెండు పిటిషన్ ని జత చేసి విచారిస్తామని హెచ్చరించింది.
• ఒక దశలో రెండింటిని జత చేయలని రిజిస్టర్ కి ఉత్తర్వులు జారీ చేయపోయింది.అంతే కాకుండా కోకాపేట భూముల వేలం ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుంది అని హెచ్చరించింది.
• జీవో 111 క్రింద నిర్మాణాలు పారిశ్రామిక కార్యకలాపాలకు నిషేధం వుందని జంటజలషయాల రక్షణకు చర్యలో భాగంగానే జీవో జారీ అయిందని ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది ముకుల్ దోహన్ వాదించారు వాటికీ అనుమతి ఇస్తే జలాశయాలు కాలుష్యకారకలుగా మారుతాయి అని మురుకునీటి కాలువలు వెలుస్తాయని ఫలితంగా సరస్సులు కలుషితం అవుతాయి అన్నారు.
• దీనిపైన హైకోర్ట్ స్పందిస్తూ ఒక వేళా అదే జరుగుతే కోకాపేట సరస్సు కూడా కలుషితం అవుతుంది అని ప్రశ్నించింది.
• 7 నెలలుగా కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదాని వాస్తవానికి కమిటీ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిఉందని గుర్తుచేసింది. 2016 లో కమిటీ ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఏమి చేసింది అని ఎన్ని సార్లు కమిటీ సమావేశం అయ్యిందో ఏ ఏ తీర్మానాలు చేసిందో చెప్పకుండా వాయిదా కోరడం ఏంటి అని ప్రశ్నించింది.
• కోకాపేట ల్యాండ్స్ పై పిల్ ధాఖలైతే వేలాన్ని అడ్డుకోవాలన్న పిటిషనర్ వినతిని తాము తోసిపుచ్చామని గుర్తు చేసింది. ఒకదశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజయ్ కుమార్ ని ఉదేశించి కోకాపేట సరస్సుకు సమీపంలోని భూములను బహుళ అంతస్థుల నిర్మాణాలకు వీలుగా 49 ఎకరాలను ప్రభుత్వం ఎలా వేలం వేస్తుంది అని ప్రశ్నించింది.
• కోకాపేట భూములను వేలం వేస్తే ఎంత మొత్తం వచ్చింది అని చెప్పలి అని కోరుతూ ఆ వివరాలు సిదంగా లేవు అని సంజయ్ కుమార్ చెప్పారు. అధికారులను సంప్రదించి చెప్పాలని విచారణను కోన సాగించింది. ఎకరం సగటు ధర 40కోట్ల వరకు ధర పలికింది అని 49 ఎకరాలకు మొత్తం 2000 కోట్ల వరకు వచ్చింది ఐన వేలం వేసిన కోకాపేట భూములు క్లాట్చ్మెంట్ ఏరియాకు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్నయి అని రిజర్వాయర్ పరీవాహిక ప్రాంతనికి ఎలాంటి ఇబ్బందులు లేవు అని జలశేయాలకు నీరు చేరవని సంజయ్ కుమార్ చెప్పారు.
• ప్రభుత్వ వివరణ పై సంతృప్తి చెందలేదు.విచారణను ఈ నెల 23 తేదికి వాయిదా వేసింది న్యాయస్థానం.